పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని సుబ్బమ్మ చెరువులో పేకాట శిబిరాల స్థావరాలపై ఆదివారం పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు హెడ్ కానిస్టేబుల్ రామాంజులు తెలిపారు.ఈ దాడులో ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,220 లు నగదు, 8 సెల్ ఫోన్లు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని, నిందితుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.