September 2, 2026
Explore
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

September 2, 2026 | Uncategorized

పుంగనూరుముచ్చట్లు:

అతివేగంగా వస్తున్న టాటాఏసీ వాహనం ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఇరువురు గాయపడిన సంఘటన పట్టణంలోని బాలాజి థియేటర్ వద్ద బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు పట్టణంలోని రహమత్ నగర్ కి చెందిన మస్తాన్(32), ఇమ్రాన్(34)లు ఆటోలో గుజిరి వ్యాపారం చేసి సాయంత్రం ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలోని బాలాజి థియేటర్ వద్దకు రాగానే అతివేగంగా వస్తున్న టాటాఏసి వాహనం ఆటోను ఢికొంది. ఈప్రమాదంలో మస్తాన్ కు కుడికాలు విరిగింది. ఇమ్రాన్ కు తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు గమనించి ఏరియా ఆసుపత్రి కి తరలించి చికిత్సలు చేపట్టారు.పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:Two injured in road accident