మదనపల్లె ముచ్చట్లు:
కర్ణాటక లో రోడ్డు ప్రమాదం జరిగి, మదనపల్లె యువకుడు దుర్మరణం పాలయ్యాడని తాలూకా సిఐ కళావెంకటరమణ తెలిపారు. పట్టణంలోని ఎగువకురవంకకు చెందిన సమీర్ భాష(38), కర్ణాటక రాష్ట్రం, చింతామణికి సొంతపనిమీద బైక్ లో వెళ్ళాడు. పని ముగించుకుని శుక్రవారం వేకువ జామున మదనపల్లె కి వస్తుండగా, మార్గ మధ్యంలోని కర్ణాటక లోని రాయల్పాడు మండలం, తూపల్లి క్రాస్ వద్ద రోడ్డు పై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టి సమీర్ బాషా దుర్మరణం చెందాడు.
Tags:Young Man from Madanapalle Dies Tragically in Karnataka Road Accident