September 1, 2026
Explore
ఇర్లపాడులో అగ్నిప్రమాదం

ఇర్లపాడులో అగ్నిప్రమాదం

September 1, 2026 | Andhra Pradesh

14 ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ తోటలు దగ్ధం

నాదెండ్ల ముచ్చట్లు:

మండల పరిధిలోని ఇర్లపాడు గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఆకతాయిలు పెట్టిన నిప్పు కారణంగా స్థానిక సుబాబుల్, జామాయిల్ తోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత, గాలుల ప్రభావంతో మంటలు శరవేగంగా వ్యాపించడంతో సుమారు 14 ఎకరాల మేర తోటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానికులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Fire accident in Irlapadu