September 1, 2026
Explore
మదనపల్లెలో దేవుడికే శఠగోపం..

మదనపల్లెలో దేవుడికే శఠగోపం..

September 1, 2026 | Andhra Pradesh


-రూ.30 కోట్ల ఆలయ మాన్యం కబ్జా

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి మండలంలోని సీటీఎంలో శ్రీ నలవీర గంగాభవాని, శ్రీ వీరాంజనేయ స్వామి వార్ల ఆలయాలకు చెందిన దేవుని మాన్యం( దేవాదాయ శాఖ) భూమి విలువ సుమారు రూ.30 కోట్ల దేవుడి భూములను కబ్జా చేశారంటూ గ్రామస్తులు సోమవారం జిల్లా దేవాదాయ శాఖ ఏసీ విశ్వనాథ కి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏసీ సర్వే నం.995/ఏ1లో 0.49 ఎకరాలు, 995/బి2లో 1.03 ఎకరాలు, 995/బి3లో 2.91 ఎకరాలు ఆలయ భూములుగా రికార్డుల్లో ఉన్నాయని, ఎవరైనా కబ్జా చేసినా, అమ్మి ఉన్న, రిజిస్టర్ చేసి ఉన్నా, పట్టా పాస్ పుస్తకాలు తెచ్చుకుని ఉన్న వాటిని రద్దు చేపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చెట్లు నరికి రాత్రికి రాత్రే రోడ్డు వేశారని, 2011లో అప్పటి సర్పంచి ప్రభాకర్ రెడ్డి హయాంలో అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణ. ఘటనపై ఏసీ విశ్వనాథ్ స్పందిస్తూ స్థల పరిశీలన చేసి కబ్జాపై నివేదిక పంపుతామన్నారు.

Tags: Even God gets hoodwinked in Madanapalle…