September 1, 2026
Explore
నమ్మించి మోసం.. రూ.22.20 లక్షలు స్వాహా

నమ్మించి మోసం.. రూ.22.20 లక్షలు స్వాహా

September 1, 2026 | Andhra Pradesh

కె.వి.పల్లి ముచ్చట్లు:

బాధితుల ఫిర్యాదుతో దంపతుల అరెస్ట్,కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన కె.వి.పల్లి పోలీసులు

కె.వి.పల్లి మండలంలో రూ.22.20 లక్షలకు పైగా నగదు మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎం.వి.పల్లి పంచాయతీ శ్రీనాథపురం కాలనీకి చెందిన కురుబోతుల శంకరమ్మ, ఆమె భర్త వెంకటరమణ పలువురిని నమ్మించి వివిధ కారణాలతో నగదు తీసుకున్నారని బాధితులు కె.వి.పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం శంకరమ్మ, వెంకటరమణను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై బి. వెంకట శివకుమార్ తెలిపారు.

ఇలాంటి వ్యక్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని బాధితులు ప్రజలకు సూచించారు.

Tags: Betrayal of trust… Rs 22.20 lakh swindled.