పుంగనూరు ముచ్చట్లు:
శ్రావణమాసం సోమవారం సందర్భంగా పట్టణంలోని ఆలయాల్లో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని మహిళలు శ్రీ కుబేర గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సంతగేటు వద్ద ఉన్న శ్రీ కుబేర గణపతి ఆలయంలో అర్చకులు స్వామివారికి గంధం, విభూది, ఫల పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ పుష్పాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags: Worship of Sri Kubera Ganapathi