August 31, 2026
Explore
రాయచోటిలో పోలీసులపై యువకుడి దాడి

రాయచోటిలో పోలీసులపై యువకుడి దాడి

August 31, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటిలో ఘర్షణ సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా బైక్ అదుపుతప్పేలా చేయడంతో కానిస్టేబుల్ డీబీ వలికి తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ కాలుకు గాయం కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విధుల్లో ఉన్న పోలీసులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని అర్బన్ సీఐ వెంకట చలపతి హెచ్చరించారు. ఘటనకు గల పూర్తి కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Tags: Youth attacks police in Rayachoti.