పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని బండ్లపల్లె గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఆదివారం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. గ్రామస్తులు కలసి సుమారు రూ.25 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రెండు రోజుల పాటు వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు శ్ద్మా•క్తంగా నిర్వహించారు. బండ్లపల్లె గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజలు పూజా కార్యక్రమాలు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి నాయకులు, బోయకొండ మాజీ చైర్మన్లు నాగరాజారెడ్డి, మిద్ధింటి శంకర్‌నారాయణ, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సిపి జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Inauguration of the Sri Boyakonda Gangamma Temple in Bandlapalle