August 30, 2026
Explore
ఆర్ సీ, డ్రైవింగ్ లైసెన్స్ ల పై కేంద్రం కొత్త సూచనలు

ఆర్ సీ, డ్రైవింగ్ లైసెన్స్ ల పై కేంద్రం కొత్త సూచనలు

August 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వాహనదారులు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్ (DL)లకు మొబైల్ నంబర్ ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇంటి నుంచే ఆన్లైన్లో ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది. RC కోసం Vahan, డ్రైవింగ్ లైసెన్స్ కోసం Sarathi పోర్టళ్లను ఉపయోగించి మొబైల్ నంబర్ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని కేంద్రం వాహనదారులను కోరింది.

Tags: Centre issues new guidelines regarding RC and driving licenses.