జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కౌన్సెలింగ్.
- ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు.
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదు.
- మంచి ప్రవర్తనతో శాంతియుతంగా ఉండాలని సూచన.
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.పోలీసుల సూచనలను పాటిస్తూ మంచి ప్రవర్తనతో, ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రశాంతంగా ఉంటామని రౌడీషీటర్లు హామీ ఇచ్చారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
Tags: Counseling for rowdy-sheeters in the wake of municipal elections.