జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాలతో విస్తృత అవగాహన కార్యక్రమాలు.
- సైబర్ నేరాలు, మహిళలు–బాలల భద్రతపై ప్రజలకు అవగాహన.
- బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, గృహ హింసపై చైతన్యం.
- యువతలో ఆకర్షణలు, క్రమశిక్షణపై ప్రత్యేక సూచనలు.
- అత్యవసర సేవలకు 112, సైబర్ మోసాలకు 1930పై అవగాహన.
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు శక్తి మహిళా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తూ విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ధామినేడు ఇందిరమ్మ ఇళ్ల ప్రాంతంలో ప్రజలకు సైబర్ నేరాలు, మహిళలపై నేరాలు, గృహ హింస, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. యువతలో ఏర్పడే ఆకర్షణలు, వాటి వల్ల ఎదురయ్యే సమస్యలు, క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన అవసరంపై సూచనలు చేశారు.అదేవిధంగా రైతు మార్కెట్ ప్రాంతంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజలకు భద్రతా భరోసా కల్పించారు. అత్యవసర సమయంలో డయల్ 112, సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930కు సమాచారం అందించాలని సూచించారు. బాలికలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని శక్తి మహిళా పోలీసులు సూచించారు.
Tags: Extensive awareness and visible policing by ‘Shakti’ women police.