రామసముద్రం ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం కెసిపల్లి పంచాయతీ వై. కురప్పల్లి గ్రామంలో వెలసిన శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో ఈనెల 26 నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు కె. లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా 26న ఉదయం అభిషేకం, సాయంత్రం ధ్వజారోహణము, కలశ స్థాపన, 27న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నిత్య హోమం, అభిషేకం, సాయంత్రం భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణోత్సవం, 28న ఉదయం అభిషేకం, పూలంగి సేవ, నిత్య హోమం, ఉట్ల తిరుణాల, సాయంత్రం గుంత యంబాడి, గుండ్లపల్లి, కురప్పల్లి గ్రామాల్లో స్వామివారి ఊరేగింపు, 29న నిత్య హోమం, స్వామివారికి అభిషేకం, దోపోత్సవం, రాత్రి పౌరాణిక డ్రామా, 30న ధ్వజా అవరోహణ, కలిశ విసర్జన, వసంతోత్సవం, రాత్రి శయనోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.
Tags: Sri Rama Navami Celebrations from the 26th