August 29, 2026
Explore
కోర్టు భవనాన్ని పరిశీలించిన జిల్లా జడ్జి

కోర్టు భవనాన్ని పరిశీలించిన జిల్లా జడ్జి

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని న్యాయస్థానాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఆరీఫాషేక్‌, పరేష్‌కుమార్‌, కృష్ణవంశి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్‌ లు ఆమెకు స్వాగతం పలికారు. నూతనంగా మంజూరైన రెండో అదనపు జ్యూడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఏర్పాటుకు సంబంధించి భవనాన్ని జిల్లా జడ్జి పరిశీలించారు. కోర్టు నిర్వహణకు అవసరమైన వసతులు, భవన పరిస్థితిని పరిశీలించి సంబంధిత అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే న్యాయవాదులతో మాట్లాడి కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందేలా సహకరించాలని కోరారు. లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు న్యాయవాదులు సహకరించాలని ఆమె స్పష్టం చేశారు.

Tags: District Judge inspects court building.