రాజంపేట ముచ్చట్లు:
పట్టించుకోని అధికారులా..? పట్టించుకోని ప్రమాద హెచ్చరికలా..?
రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్ తిరుపతి రోడ్డులో తిరుపతి బస్సులు ఎక్కే ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది..
పగలు రాత్రి అనే తేడా లేకుండా తిరుపతికి వెళ్లాల్సినటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడూ అక్కడ నిలబడుకొని అది తిరుపతి బస్సు స్టాప్ అక్కడే నిలబడుకొని ఉంటారు..
కేవలం ఇద్దరికీ బలమైన గాయాలతో ప్రమాదం తప్పింది ఒకవేళ ఇంకా ఏదైనా జరగరానిది జరిగి ఉంటే పరిస్థితి ఏమిటి అని స్థానికులు ఆవేదన….
బిల్డింగ్ పై నుంచి ఫ్లెక్సీ బ్యానర్, దానికి సంబంధించిన ఇనుప రాడ్లు కింద పడటంతో అక్కడ ఉన్న ఇద్దరికి తలకు గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్థానికుల కథనం ప్రకారం… బిల్డింగ్‌పై చాలా రోజులుగా చినిగిపోయిన ఫ్లెక్సీలు, ఇనుప రాడ్లతో కూడిన బ్యానర్లు ప్రమాదకరంగా ఉన్నప్పటికీ తొలగించలేదని చెబుతున్నారు. ఈరోజు వీచిన గాలికి ఫ్లెక్సీ ఊడిపడి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఇనుప నిర్మాణాలను అధికారులు వెంటనే గుర్తించి తొలగించాలి.
ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు కాదు… ప్రమాదం జరగకముందే ముందస్తు చర్యలు అవసరం.

Tags: Flex banner havoc at Rajampet Old Bus Stand… two injured!