August 29, 2026
Explore
ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలి

ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలి

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

ఎస్సీ ఎస్టీ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మానటరింగ్‌ అండ్‌ విజిలెన్స్ కమిటి చైర్మన్‌ పాలకుంట్ల శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. శనివారం తహశీల్ధార్‌ కార్యాలయంలో ఎస్సీఎస్టీ విజిలెన్స్ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫథకాలు అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి వారి అభివృద్ధికి అధికారులు సహకరించాలని సూచించారు. సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమావేశాలకు అధికారులు తప్పనిసరిగా హాజరై బాధ్యతాయుతంగా వ్యహరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈసమావేశంలో తహశీల్ధార్‌ రాము, ఎంవిఐ సుప్రియ, ఎస్‌ఐ అన్సర్‌బాషా, ఎంఈవో నటరాజరెడ్డి, నాయకులు అశోక్‌, శంకరప్ప, చెన్నరాయుడు, రాజా, నరసింహులు, కృష్ణప్ప్ర, రామయ్య, రమణ, సుబ్రమణ్యం, ఆంజప్ప, మహేంద్ర, గంగప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags: The benefits of government welfare schemes must be extended to SCs and STs.