August 29, 2026
Explore
ఓట్ల తొలగింపు అవాస్తవం

ఓట్ల తొలగింపు అవాస్తవం

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ సందర్భంగా 6 వేల ఓట్లు తొలగించారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సహాయ ఎన్నికల నమోదు అధికారి రాము తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మృతి చెందిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లు మాత్రమే నిబంధనల మేరకు తొలగించామని తెలిపారు. పుంగనూరు రూరల్‌లో ఓటర్ల జాబితా సవరణకు సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చుతామని తెలిపారు.

Tags: The claim of vote deletion is untrue.