August 29, 2026
Explore
వాడవాడల మాతృబాషా దినోత్సవ వేడుకలు

వాడవాడల మాతృబాషా దినోత్సవ వేడుకలు

August 29, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

మాతృబాషగా వర్ధిల్లుతున్న తెలుగుబాషా దినోత్సవ వేడుకలు శనివారం వాడవాడల వైభవంగా నిర్వహించారు. జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో హెచ్‌ఎం రుద్రాణి ఆధ్వర్యంలో గిడుగు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అలాగే కొత్తయిండ్లు మున్సిపల్‌ హైస్కూల్‌లో హెచ్‌ఎం ఉషారాణి గిడుగు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ అన్నార్‌ ఆధ్వర్యంలో మాతృబాషా దినోత్సవాన్ని నిర్వహించారు.అలాగే మండలంలోని గూడూరుపల్లి జెడ్పి హైస్కూల్‌లో హెచ్‌ఎం మహేష్‌నారాయణ ఆధ్వర్యంలో మాతృబాషా దినోత్సవాన్ని నిర్వహించి, గిడుగురామ్మూర్తి, తెలుగుతల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి , నివాళులర్పించారు. తెలుగుతల్లి వేషధారణలో బాలికలు సాంప్రదాయ దుస్తులు ధరించి , మాతృబాషను గౌరవించాలని, ప్రతి ఒక్కరు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జివి.రమణ, రాజేశ్వరి, భారతి తదితరులు పాల్గొన్నారు.

Tags: Mother Language Day celebrations across every street and neighborhood.