August 27, 2026
Explore
జగనన్న కాలనీలలో నీటి సమస్య

జగనన్న కాలనీలలో నీటి సమస్య

August 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో గల జగన్న కాలనీలలో నీటి సమస్య తీవ్రంకావడంతో ఆప్రాంత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన సంఘటన గురువారం జరిగింది. రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురై తాగునీటికి అవస్థలు పడుతున్న అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయమై తక్షణం చర్యలు తీసుకోకపోతే మున్సిపాలిటి ఎదుట నిరసన తెలుపుతామని హెచ్చరించారు.

Tags: Water problem in Jagananna Colonies