తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడవాహనంపై శుక్రవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు.
సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించనున్నారు.
Tags: ‘Madiri Brahmotsavam’ Garuda Seva in Tirumala on the 28th