August 27, 2026
Explore
సెప్టెంబరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

సెప్టెంబరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

August 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు, సేవలు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో..

సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

సెప్టెంబరు 22న ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

శ్రీ బలరామకృష్ణస్వామి ఆలయంలో..

సెప్టెంబరు 4న రోహిణి నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణస్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.

శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో..

సెప్టెంబరు 27న ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సుందరరాజస్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో..

సెప్టెంబరు 13న హస్తా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ సూర్యనారాయణస్వామివారు తిరుచ్చి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో..

సెప్టెంబరు 5, 12, 19, 26వ తేదీల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు విశేషంగా అభిషేకం నిర్వహించనున్నారు.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో..

సెప్టెంబరు 1న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 9న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో ఉదయం 8.15 గంటలకు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు.

Tags: Special festivals at the Sri Padmavati Ammavari Temple in September