August 27, 2026
Explore
వైభవంగా తొండమాన్ పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పవిత్ర సమర్పణ

వైభవంగా తొండమాన్ పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పవిత్ర సమర్పణ

August 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

     తొండమాన్ పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన గురువారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు.

ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, కొలువు, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం నిర్వహించారు. అనంతరం ఆల‌యంలోని మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో కుమారి దేవి, టెంపుల్‌ ఇన్స్పెక్టర్ సుదీర్‌, ఆల‌య అర్చకులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.


Tags: Grand Offering of 'Pavitra' to Sri Venkateswara Swamy at Thondamanpuram