రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట పాత బస్టాండ్‌లో బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు సర్వీసుల కోసం గంటకు పైగా ప్రయాణికులు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు సర్వీసులను సక్రమంగా నడపాలని కోరుతున్నారు.
Tags: Passengers wait endlessly for buses in Rajampet.