August 27, 2026
Explore
పుల్లంపేటలో 250 మొక్కలు నాటిన పోలీసులు

పుల్లంపేటలో 250 మొక్కలు నాటిన పోలీసులు

August 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పుల్లంపేట ఎస్బీవీడీఎస్ హైస్కూల్‌లో పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కోడూరు రూరల్ సర్కిల్ సీఐ, పుల్లంపేట ఎస్‌ఐ కలిసి పాఠశాల ప్రాంగణంలో 250 మొక్కలు నాటారు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షణపై అవగాహన కల్పించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పెద్ద చెట్టుగా పెంచాలని పోలీసులు సూచించారు.
“నేడు నాటిన మొక్కలు.. రేపటి తరాలకు పచ్చని భవిష్యత్” అని అధికారులు పేర్కొన్నారు.

Tags: Police planted 250 saplings in Pullampet.