August 27, 2026
Explore
క్రీడాకారుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్య.

క్రీడాకారుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్య.

August 27, 2026 | Andhra Pradesh

  • మహిళా యూనివర్సిటీ రోడ్డులో క్రీడాకారులకు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన.
  • పద్మావతి బాలికల పాఠశాలలో గుంటూరు వాలీబాల్ క్రీడాకారులకు పోలీస్ సేవలపై అవగాహన.
  • అత్యవసర పరిస్థితుల్లో డయల్-112ను వినియోగించుకోవాలని సూచన.

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు క్రీడాకారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

మహిళా యూనివర్సిటీ రోడ్డులో ప్రయాణిస్తున్న క్రీడాకారులకు రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అప్రమత్తంగా వ్యవహరించడం తదితర అంశాలపై సాధారణ సూచనలు అందించారు.

అలాగే పద్మావతి బాలికల పాఠశాలలో గుంటూరు నుండి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులకు పోలీస్ అధికారులు సాధారణ భద్రతా సూచనలు అందించి, పోలీస్ టోల్‌ఫ్రీ నంబర్లు, డయల్-112 అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు.

క్రీడాకారులు ప్రయాణ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పరిసరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య లేదా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Tags:The Tirupati District Police Department attaches special importance to the safety of sportspersons.