సుండుపల్లి ముచ్చట్లు:
సుండుపల్లి మండలం తిమ్మసముద్రం–బింగివాండ్లపల్లి మార్గంలో ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివ తన పెద్దమ్మతో కలిసి ద్విచక్రవాహనం పై వెళ్తుండగా దిగవపల్లి సమీపంలో ట్రాక్టర్ ఢీకొంది.
ఈ ప్రమాదంలో శివ పెద్దమ్మ తీవ్రంగా గాయపడటంతో తొలుత స్థానికంగా చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి. మహేష్ తెలిపారు.
Tags: Case registered regarding road accident.