August 27, 2026
Explore
రాయవరం సరస్వతమ్మ దశదిన ఖర్మకాండకు శ్రీకాంత్ రెడ్డి నివాళులు

రాయవరం సరస్వతమ్మ దశదిన ఖర్మకాండకు శ్రీకాంత్ రెడ్డి నివాళులు

August 27, 2026 | Andhra Pradesh

రాయవరం ముచ్చట్లు:

చెన్నముక్కపల్లె గ్రామానికి చెందిన మాజీ డీలర్ చిన్నపురెడ్డి సతీమణి, మాజీ ఏపీఐఐసీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి చిన్నమ్మ సరస్వతమ్మ దశదిన ఖర్మకాండ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సరస్వతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సరస్వతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి స్టేట్ లీగల్ సెల్ కో ఆర్డినేటర్ జల్లా సుదర్శన్ రెడ్డి, స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు.

Tags: Srikanth Reddy pays tribute at the tenth-day funeral rites of Saraswatamma from Rayavaram.