August 27, 2026
Explore
రాయచోటిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రాయచోటిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

August 27, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణ పరిధిలోని SN కాలనీ చెక్‌పోస్ట్ సమీపంలోని శివాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.

మృతికి గల కారణాలు తెలియరాలేదని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Tags: Unidentified person dies in Rayachoti