మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో ఆగస్టు 27న ‘వికసిత్ భారత్ యువ కనెక్ట్–స్పోర్ట్స్ ఎడిషన్’ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు, క్రీడాకారులతో వర్చువల్‌గా సంభాషించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పి. రామనాథన్ తెలిపారు. క్రీడా రంగంలో దేశం సాధించిన పురోగతి, మౌలిక వసతులు, యువ క్రీడాకారులకు అందుతున్న అవకాశాలపై ప్రధాని ప్రసంగించనున్నారు. కార్యక్రమానికి విద్యార్థులు, క్రీడాకారులు ఉదయం 10 గంటల్లోపు యూనివర్సిటీకి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు.
Tags: PM Modi to interact virtually with students and sportspersons.