March 26, 2026
Explore
వాట్సాప్ కాల్‌లో అరెస్ట్ (డిజిటల్ అరెస్ట్) అంటే వెంటనే అప్రమత్తం అవ్వండి

వాట్సాప్ కాల్‌లో అరెస్ట్ (డిజిటల్ అరెస్ట్) అంటే వెంటనే అప్రమత్తం అవ్వండి

March 26, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు:


విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

*️⃣ సైబరు మోసానికి గురైనా లేదా వాట్సాప్ కాల్‌లో అరెస్ట్ (డిజిటల్ అరెస్ట్) అంటే వెంటనే 1930 లేదా డయల్ 100/112 కు సమాచారం అందించాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్న జిల్లా ఎస్పీ

*️⃣ సైబరు మోసానికి గురైనట్లయితే మొదటి గంటలో (గోల్డెన్ హవర్) 1930కు ఫిర్యాదు చేయాలన్న జిల్లా ఎస్పీ

*️⃣ సైబరు మోసాలు, వాట్సాప్ కాల్‌లో అరెస్ట్ (డిజిటల్ అరెస్ట్) పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ

*️⃣ ఓ.టి.పి., వ్యక్తిగత సమాచారం, పాస్వర్డులను ఇతరులతో పంచుకోవద్దన్న జిల్లా ఎస్పీ

*️⃣ అపరిచిత ఫోన్ కాల్స్ ఎత్తడం, అనుమానస్పద లింకులు, ఎపికే ఫైల్స్ ఓపెన్ చేయడం చేయరాదన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

సైబరు మోసాలు, వాట్సాప్ కాల్‌లో అరెస్ట్ చేయడం (డిజిటల్ అరెస్ట్) వంటి మోసాల పట్ల అవగాహన లోపం కారణంగా ఇటీవలి కాలంలో ప్రజలు మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి సైబరు మోసగాళ్ళు, వారు చెప్పే మాయమాటలు పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మార్చి 26న పిలుపునిచ్చారు.

జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – ఇటీవలి కాలంలో వాట్సాప్ కాల్‌లో అరెస్ట్ చేయడం (డిజిటల్ అరెస్ట్) పేరుతో సైబరు మోసాలు పెరుగుతున్నాయన్నారు. కొంతమంది సైబరు మోసగాళ్లు తాము పోలీసు అధికారులు, సిబిఐ, ఈడి వంటి సంస్థల అధికారులు అని చెప్పుకొని వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు. ఈ విధంగా సైబరు మోసగాళ్లు ప్రజలను ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని మీ ఆధార్, బ్యాంక్ ఖాతాలు లేదా మొబైల్ నంబర్ క్రైమ్‌లో ఉపయోగించబడిందని, మీ పిల్లల పై డ్రగ్స్ కేసు నమో దయ్యిందని చెబుతూ, “మీరు అరెస్ట్‌లో ఉన్నారు” అని నమ్మిస్తారని, తద్వారా, మీపై కేసు నమోదు చేయకుండా ఉండటానికి డబ్బులు పంపాలని ఒత్తిడి చేస్తారని జిల్లా ఎస్పీ తెలిపారు. వాస్తవానికి వాట్సాప్ కాల్‌లో అరెస్ట్ చేయడం (డిజిటల్ అరెస్ట్) అనే విధానం భారతదేశంలో లేదని, పోలీస్ లేదా ఇతర దర్యాప్తు సంస్థలు వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయవని, ఇది పూర్తిగా సైబరు మోసగాళ్లు పని అని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇటువంటి నేరగాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మవద్దని, ఎవరైనా ఈ తరహాలో ఫోనులు చేస్తే సమాచారాన్ని డయల్ 100/112 లేదా 1930కు అందించాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు. అదే విధంగా సైబరు నేరాలకు పాల్పడే మోసగాళ్ళు ప్రజల వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగు వివరాలు, ఓ.టి.పి.లు, సివివి, పాస్వర్డులు లాంటి అంశాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, వాటిని ఎట్టి పరిస్తితుల్లోని ఇతరులతో పంచుకోవద్దని, గోప్యత పాటించాలన్నారు. ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ చలానాల పేరుతో, గ్యాస్ బుకింగ్ పెరుతో లింకులు మరియు ఎపికే ఫైల్స్ పంపి ప్రజలనుండి సైబర్ నేరగాళ్ళు దోచుకుంటున్నారన్నారు. ప్రజల ఆసక్తిని గమనించి, సైబరు నేరగాళ్ళు వారి మొబైలు ఫోన్లకు కొన్ని లింకులు, ఎపికే ఫైల్స్, క్యూఆర్ కోడ్స్, సందేశాలను, ఈ-మెయిల్ పంపి, వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారన్నారు. అదే విధంగా ఆన్-లైన్ లోన్ యాపుల వైపు వెళ్ళవద్దని ప్రజలను కోరారు. ఈ దాడులను నియంత్రించేందుకు ప్రజలు సైబరు మోసాలు పట్ల అవగాహన పెంచుకోవాలని, అనుమానస్పద లింకులు, ఎపికే ఫైల్స్ పై క్లిక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ కోరారు.

Tags; If you receive a WhatsApp call regarding an arrest (a “digital arrest”), be immediately alert.