అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న నెలలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. పసిఫిక్ నుంచి వచ్చే మేఘాలు చైనా వైపు వెళ్లడమే మన వర్షాభవానికి కారణమన్నారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనాల వల్ల వచ్చే నెలలో ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో వర్షాలు పెరగొచ్చని అంచనా వేశారు. ఖరీఫ్ చివర్లో పడే ఈ వర్షాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Tags;Likelihood of increased rainfall next month.