రాయచోటి ముచ్చట్లు:
అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో HIV/ఎయిడ్స్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రవి శంకర్ మాట్లాడుతూ యువత హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ, పరీక్షలు, చికిత్సపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ప్రజా చైతన్య సేవా సంఘం ప్రాజెక్ట్ మేనేజర్ స్వాతి మాట్లాడుతూ HIV నివారణలో అవగాహన కార్యక్రమాలు కీలకమన్నారు. HIV తో జీవిస్తున్న వారిపట్ల వివక్ష చూపకుండా, అపోహలను తొలగించేందుకు యువత చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహిస్తున్న ఇంటెన్సిఫైడ్ IEC క్యాంపెయిన్‌లో భాగంగా విద్యార్థులకు హెచ్‌ఐవీ పరీక్షలు, నివారణ, చికిత్సపై అవగాహన కల్పించారు.
Tags: Awareness about HIV/AIDS needs to be raised among the youth.