విజయనగరం ముచ్చట్లు:
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి జాతర షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయి. అక్టోబర్ 26న తొలేళ్ల మహోత్సవం, 27న ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవం జరగనున్నాయి. అనంతరం నవంబర్ 3న తెప్పోత్సవం, 7న కలశజ్యోతి ఊరేగింపు, 11న చండీ హోమంతో జాతర ముగుస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.
Tags: Here is the schedule for the Goddess Paidithalli Sirimanotsavam festival.