విశాఖపట్నం ముచ్చట్లు:
తాగునీటి కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ నగరానికి సాంత్వన చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి జలాలను నేరుగా నగరానికి తరలించేందుకు రూ.1,000 కోట్లతో సమగ్ర తాగునీటి ప్రణాళికను సిద్ధం చేసింది. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు తీసుకువచ్చి, అక్కడి నుంచి నగరానికి సరఫరా చేయనున్నారు. ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని అందించనుంది.
Tags: Drinking water for Visakhapatnam at a cost of ₹1,000 crore.