తిరుమల ముచ్చట్లు:
నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అదేవిధంగా, తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తేనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ముందస్తుగా లాగిన్ అయి టికెట్లు, గదులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
Tags: Tickets released today