August 25, 2026
Explore
ఏపీలో గిరిజన గురుకుల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు

ఏపీలో గిరిజన గురుకుల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు

August 25, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గిరిజన సంక్షేమశాఖ జీఓ 33 జారీ చేసింది. జులై 2026 నుంచి పదవీ విరమణ చేసేవారి సర్వీసును కొనసాగించేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, ఈ పెంపుపై కొన్ని షరతులు విధించారు. తిరిగి విధుల్లో చేరేనాటికి వేతన బకాయిలు చెల్లించబోమని, గ్రాట్యుటీ, పెన్షన్ పొంది ఉంటే జీఓ 45 ప్రకారం రికవరీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గురుకుల ఉద్యోగుల సర్వీస్ రూల్స్లో సవరణలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Tags: Retirement age of tribal Gurukul employees increased in AP