August 25, 2026
Explore
అసభ్యకర ప్రవర్తనపై విలేకరి అరెస్ట్

అసభ్యకర ప్రవర్తనపై విలేకరి అరెస్ట్

August 25, 2026 | Andhra Pradesh

ప్రొద్దుటూరు ముచ్చట్లు:

ప్రొద్దుటూరులో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు బెదిరించిన ఘటనలో ఓ దినపత్రిక విలేకరి మారెళ్ల ధీరజ్ ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని నాగేంద్రనగర్ లో కారును దారికి అడ్డంగా పెట్టారని సుబ్బారావు కుటుంబ సభ్యులతో గొడవ పడటంతోపాటు మహిళలను తిట్టి, బెదిరించిన ఘటనపై ఆదివారం వన్ టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మారెళ్ల ధీరజ్ ను అదివారం అరెస్ట్ చేసి, నోటీసు ఇచ్చి పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Tags: Reporter arrested for indecent behavior.