శ్రీశైలం ముచ్చట్లు:
వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.గత నెల 28న శ్రీశైలం చేరుకున్న ఈ కుటుంబం సత్రంలోని గదిలో బస చేస్తోంది.వీరిలో ఇద్దరు పురుషులు గదిలోని హాలులో ఫ్యాన్‌కు ఉరేసుకోగా ముగ్గురు మహిళలు స్నానాల గదిలో (బాత్రూమ్‌లో)ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు రెండు రోజుల క్రితమే జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సత్రం గదినుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో నిర్వాహకులు స్థానికులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీఎస్పీ రామాంజనేయులు పరిస్థితిని సమీక్షించారు.మృతులను పల్లపు సుధాకర్ (36)ఆదిలక్ష్మి (50)మల్లేశ్వరి (45)శ్రీదేవి (33)మణికంఠ(15)గా గుర్తించారు.వీరంతా దాదాపు నెల రోజుల నుంచి ఇక్కడే బస చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ దారుణానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Deep tragedy at Srisailam