ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి శ్రీనివాస హోటల్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Road accident in Ibrahimpatnam… wife dies.