పుంగనూరుముచ్చట్లు:
మతమార్పిడి చేసి, నూకరాజు కుటుంబం మరణానికి కారణమైన సాధిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంభాన్ని ఆదుకోవాలని హిందూ సంఘం ప్రతినిదులు ధర్నా చేశారు. సోమవారం సంఘ నాయకులు త్రిమూర్తిరెడ్డి, నానబాలమణి, వెంకటరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డిల ఆధ్వర్యంలో ప్రతినిదులు స్థానిక గోకుల్ సర్కిల్ నుంచి సాధిక్ ఫోటోలు పట్టుకుని నిరసన ర్యాలీ తెలిపారు. తహశీల్ధార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు కు వినతిపత్రం సమర్పించారు. సాధిక్ పై కఠిన చర్యలు తీసుకుని, బాధిత కుటుంభానికి రక్షణ కల్పించాలని కోరారు.
Tags: The family of Nookaraju, a victim of religious conversion, must be supported.