August 24, 2026
Explore
గురుకుల పాఠశాల నిర్మించాలి

గురుకుల పాఠశాల నిర్మించాలి

August 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని గిరిజన బాలికల కోసం గురుకుల పాఠశాలను నిర్మించాలని వైఎస్సార్‌సిపి ఎస్టీ సంఘం రాష్ట్ర కార్యదర్శి భాణావత్‌ మునీంద్రనాయక్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ.7.50 కోట్లు మంజూరైన , పనులు చేయకపోవడం బాధకరమన్నారు. అలాగే మదనపల్లెలో గిరిజన భవన్‌ కోసం స్థలం కేటాయించి, భవన్‌ నిర్మించాలన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్షం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై స్పందించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Tags: A residential school must be built.