August 24, 2026
Explore
మదనపల్లె కలెక్టరేటి ఎదుట న్యాయ పోరాట దీక్షకు పూనుకున్న మహిళ

మదనపల్లె కలెక్టరేటి ఎదుట న్యాయ పోరాట దీక్షకు పూనుకున్న మహిళ

August 24, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

రామసముద్రం మండలంలోని కాప్పల్లి పంచాయతీ, గజ్జల వారిపల్లికి చెందిన వీరభద్ర భార్య కళావతమ్మ కాప్పల్లికి చెందిన రాజప్పకు 2018లో తన వ్యవసాయ బోర్ లో నీళ్లు అడుగంటి పోవడంతో రూ. 4 లక్షల విలువ చేసే నాలుగు పాడి ఆవులు కాట్పల్లికి చెందిన రాజప్పకు పాలికి తొలిచ్చి కూలి పనులకు బెంగుళూరు కు వెళ్ళాము. తిరిగి ఏడాది తరవాత వస్తే రాజప్ప ఆవులు ఇవ్వలేదు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు నటించిన రాజప్ప తనకు ఇంతవరకు నాకు ఆవులు దూడలను అప్పజెప్పలేదు. గ్రూపుల్లో చేసిన అప్పు లోళ్ల కు ఆవులు లేని కారణంగా చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాను. ఐదేళ్లుగా అధికారులు పోలీసుల చుట్టూ తిరుగుతున్న న్యాయం చేయలేదని, సోమవారం మదనపల్లి కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షకు పూనుకున్నట్లు కన్నీటి పర్వంతమవుతోంది… అధికారులు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

Tags: Woman embarks on a protest for justice in front of the Madanapalle Collectorate.