August 23, 2026
Explore
పుంగనూరులో ఏడిజె కోర్టు ఏర్పాటు చేయాలి

పుంగనూరులో ఏడిజె కోర్టు ఏర్పాటు చేయాలి

August 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని చిత్తూరు మాజీ ఎంపి , సీనియర్‌ న్యాయవాది ఎన్‌.రెడ్డెప్ప ఆదివారం కోరారు. ప్రస్తుతం సెషన్స్ కేసుల కోసం న్యాయవాదులు, ప్రజలు మదనపల్లె కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని , దీని ద్వారా అధికవ్యయం, సమయము వృధా అవుతోందని ఆయన తెలిపారు. మదనపల్లెలో రెండు అదనపు జిల్లా కోర్టులు ఉన్నాయని, అక్కడ ఉన్న కోర్టును వారానికి ఒక్కసారైన పుంగనూరులో నిర్వహించేలా హైకోర్టు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రం పంపుతున్నట్లు ఆయన తెలిపారు. వారంలో ఒక రోజు పుంగనూరులో కేసులు నిర్వహిస్తూ, పూర్తి స్థాయిలో జిల్లా కోర్టును ఏర్పాటు చేసి, ఈ ప్రాంత ప్రజలకు, న్యాయవాదులకు , ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags: An ADJ court should be established in Punganur.