– పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా రథోత్సవం.
- 18 రోజుల పాటు అత్యంత వైభవంగా ధర్మరాజు తిరునాళ్లు.
- అశేష భక్తజనంతో పుత్తూరు పట్టణంలో భక్తిశ్రద్ధల సందడి.
- రథోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు.
- జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాలతో పటిష్ట బందోబస్తు.
- పుత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో విస్తృత భద్రతా చర్యలు.
- ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమర్థవంతమైన పోలీసింగ్.
- ఈరోజు రాత్రి జరిగే అగ్నిగుండం కార్యక్రమానికి కూడా విస్తృత బందోబస్తు.
తిరుపతి ముచ్చట్లు:
పుత్తూరు పట్టణంలో 18 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన ధర్మరాజు తిరునాళ్లు అశేష భక్తజనం పాల్గొనడంతో భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మరాజు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.
తిరునాళ్ల సందర్భంగా భక్తుల రద్దీని, ముఖ్యంగా రాత్రి నిర్వహించిన ధర్మరాజు రథోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు పుత్తూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే నేపథ్యంలో అదనపు పోలీస్ బలగాలను మోహరించి విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
పుత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది రథోత్సవ మార్గంలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
రాత్రి జరిగిన ధర్మరాజు రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నప్పటికీ, పుత్తూరు సబ్ డివిజన్ పోలీసుల సమర్థవంతమైన బందోబస్తు, సమన్వయం, నిరంతర పర్యవేక్షణతో రథోత్సవం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించబడింది.
తిరునాళ్ల ముగింపు సందర్భంగా ఈరోజు రాత్రి నిర్వహించనున్న అగ్నిగుండం కార్యక్రమానికి కూడా పోలీసులు విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున భక్తుల భద్రత, రాకపోకలు, కార్యక్రమం సజావుగా నిర్వహణకు అనుగుణంగా పోలీసు అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈరోజు రాత్రి జరిగే అగ్నిగుండం కార్యక్రమంతో 18 రోజుల పాటు నిర్వహించిన ధర్మరాజు తిరునాళ్లు ముగియనున్నాయి.
భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తిరునాళ్లు, రథోత్సవం, అగ్నిగుండం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ బందోబస్తులో ఇన్‌స్పెక్టర్, పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్, సీఐ, పుత్తూరు రూరల్, సీఐ, సత్యవేడు సర్కిల్, అలాగే WSI నాగేంద్ర, పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్, SI వెంకటలక్ష్మి, పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్, SI, KVB పురం, SI, నాగలాపురం, SI, వరదయ్యపాలెం తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Dharmaraju Tirunallu Celebrated with Grandeur