అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను మదనపల్లెలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటాద్రి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటంలో బ్రిటీష్ తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ప్రకాశం పంతులు అని కొనియాడారు. ఆయన ధైర్యం, నిస్వార్థ ప్రజాసేవ నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) యు. రంగనాథ్ బాబు, ఆర్ఎస్ఐలు శ్రీనివాస్, మగ్బుల్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Tanguturi Prakasam Pantulu’s birth anniversary celebrations held on a grand scale.