August 23, 2026
Explore
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు

August 23, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తంగా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026ను విడుదలచేసింది. నాలుగుదశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్-1లో 149పోస్టులు, గ్రూప్-2లో 673ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులతో పాటు పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక శాఖలు, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ శాఖలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags: Good news for the unemployed from the AP government.