. యూట్యూబ్ మానిటైజేషన్ కొత్త నిబంధనలు ఇవే!
అమరావతిముచ్చట్లు:
యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో భారీ మార్పు చేసింది. ఆగస్టు 24 నుంచి వీడియో ప్లే అయిన వెంటనే పబ్లిక్ వ్యూగా రికార్డ్ అవుతుంది. దీనివల్ల వ్యూస్ కౌంట్ వేగంగా పెరిగినా, ఆదాయం మాత్రం ఎంగేజ్డ్ వాచ్ టైమ్ పైనే ఆధారపడి ఉంటుంది. అలాగే 2027 ఫిబ్రవరి నుంచి కొత్త ఛానెళ్లకు మానిటైజేషన్ అర్హతలను 8,000 వాచ్ అవర్స్‌కు పెంచనుంది
యూట్యూబ్‌లో వీడియో వ్యూస్ ఎలా కౌంట్ అవుతాయనే విషయంలో గూగుల్ యాజమాన్యం చరిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. 2026 ఆగస్టు 24 నుంచి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చే కొత్త విధానం ప్రకారం, యూజర్ వీడియోపై క్లిక్ చేసి ప్లే చేయడం ప్రారంభించిన మరుక్షణమే అది ఒక వ్యూగా నమోదవుతుంది. లాంగ్ వీడియోలు, షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్ అన్నింటికీ ఒకే విధమైన కొలమానాన్ని అమలు చేయబోతున్నారు. అయితే వ్యూస్ విపరీతంగా పెరిగినంత మాత్రాన క్రియేటర్ల బ్యాంక్ ఖాతాల్లో ఆదాయం భారీగా పెరిగిపోతుందని భావిస్తే పొరపాటే…?
అసలు పాత నిబంధనకు, కొత్త రూల్‌కు తేడా ఏంటి?
ఇప్పటివరకు లాంగ్ ఫార్మాట్ వీడియోలకు, షార్ట్స్‌కు యూట్యూబ్ వేర్వేరు నిబంధనలు అమలు చేసేది. సాధారణంగా యూజర్ కనీసం కొన్ని సెకన్ల పాటు వీడియో చూస్తేనే వ్యూగా పరిగణించేవారు. తాజా నిబంధనలతో ఆ సంక్లిష్టత తొలగిపోయింది. వీడియో మొదటి ఫ్రేమ్ ప్లే అవ్వగానే పబ్లిక్ వ్యూగా లెక్కగడతారు. టిక్‌టాక్ వంటి ఇతర ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న విధానాన్ని ఇప్పుడు యూట్యూబ్ కూడా పాటిస్తోంది. దీనివల్ల క్రియేటర్ల ఛానెల్స్‌పై కనిపించే పబ్లిక్ వ్యూస్ సంఖ్య వేగంగా పెరిగి, మిలియన్ వ్యూస్ మార్క్ త్వరగా అందుకోవచ్చు.
వ్యూస్ పెరిగితే ఆదాయం పెరుగుతుందా?
పబ్లిక్ వ్యూస్ పెరగడం కేవలం డిస్‌ప్లే సంఖ్యను మాత్రమే పెంచుతుంది తప్ప, ఆదాయాన్ని కాదని యూట్యూబ్ కుండబద్దలు కొట్టింది. ఈ నిబంధనపై యూట్యూబ్ యాజమాన్యం స్పందిస్తూ.. “పబ్లిక్ వ్యూస్ లెక్కింపు విధానంలో తెచ్చిన మార్పు క్రియేటర్ల సంపాదనను గానీ, యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ అర్హతలను గానీ మార్చదు. ఆదాయం అనేది ఎప్పటిలాగే ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్ ఆధారంగానే ఉంటుంది.” అని చెప్పింది.
ఏఐ కంటెంట్, కొత్త మానిటైజేషన్ షాక్
ఈ మార్పుతో పాటు నాణ్యమైన ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించేందుకు యూట్యూబ్ మరిన్ని కఠిన నిబంధనలు తెచ్చింది. ఎలాంటి క్రియేటివిటీ లేకుండా మెషిన్లతో పెద్ద ఎత్తున తయారు చేసే రొటీన్ ఏఐ వీడియోలకు మానిటైజేషన్ నిలిపివేస్తారు. ఏఐ టూల్స్ వాడినా అందులో క్రియేటర్ క్రియేటివ్ ఆలోచన, ఎడ్యుకేషనల్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్ విలువ ఉండటం తప్పనిసరి.
మరోవైపు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టే వారికి 2027 ఫిబ్రవరి 1 నుంచి అర్హత ప్రమాణాలు మరింత కఠినం కానున్నాయి. అడ్వర్టైజింగ్, ప్రీమియం రెవెన్యూ పొందాలంటే 1,000 సబ్‌స్క్రైబర్లతో పాటు గత ఏడాదిలో 8,000 వాచ్ అవర్స్ లేదా 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది. వ్యూస్ పెంచుకోవడం సులువైనా, అసలైన ఆదాయం రావాలంటే నాణ్యమైన కంటెంట్‌తో యూజర్లను ఎంగేజ్ చేయడం ఒక్కటే మార్గం.అని అంటున్నారు.
Tags: You won’t earn a single rupee, even if you get a million views.