పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘంచే శనివారం సంఘ కార్యాలయంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి ఆధ్వర్యంలో రోగులకు వివిధ రకాల కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 72 మంది రోగులు శిబిరంలో పాల్గొని చికిత్సలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు వెంకటపతి, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags: Eye medical camp organized by retired employees