పుంగనూరుముచ్చట్లు:
సమాజంలోని ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఈరార్షాధ్వేషాలను వదిలి ఘర్షణలకు, అల్లర్లకు తావులేకుండ శాంతియుత వాతావరణంలో జీవించాలని పట్టణ మేదావులు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని మానవత స్వచ్చంధ సంస్థ , మేదావులు, విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేదావులు భక్తవత్సలంరాజు, రెడ్డెప్పరెడ్డి, చెంగారెడ్డి ల ఆధ్వర్యంలో ర్యాలీని గోకుల్ సర్కిల్, పోలీస్‌స్టేషన్, బస్టాండ్, ఎంబిటి రోడ్డు మీదుగా ఇందిరా సర్కిల్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈర్షాధ్వేషాలు పెరిగిందని, వాటి కారణంగా అనర్థాలు జరుగుతుందన్నారు. ఈ విషయంలో యువత ముందుకురావాలని, యువత సమాజంలో అవగాహన తీసుకురావాలని కోరారు. ఈ ర్యాలీలో సంస్థ ప్రతినిదులు హరినాథరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Live in a peaceful atmosphere.