August 22, 2026
Explore
ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు

ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు

August 22, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి, యువకులు తమ ఓటు నమోదు కార్యక్రమాన్ని చేసుకునేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తహశీల్ధార్‌ రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటర్ల నమోదు కోసం పట్టణంలో శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. సచివాలయాల పరిధిలో నియమించిన బిఎల్‌వోలు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పకడ్భంధింగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు, తమ ప్రాంతంలో నూతన ఓటర్లను గుర్తించి , నమోదు చేసే కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

Tags: Special camps for voter registration